: అక్కడ అంగుళం భూమి తీసుకున్నా సహించం: కేసీఆర్ కు షబ్బీర్ హెచ్చరిక
ఉస్మానియా యూనివర్శిటీలో పదకొండు ఎకరాల స్థలం కొని ఇళ్ల నిర్మాణం చేపడతామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం వివాదాస్పదమవుతోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది. యూనివర్శిటీలో అంగుళం భూమిని తీసుకున్నా పోరాటం తప్పదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హెచ్చరించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించిన రైతు ఆత్మహత్యల ఎఫ్ఐఆర్ కాపీలు తమ దగ్గర ఉన్నాయని... ఆ ఆత్మహత్యలు నిజమైనవేనని తేలితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారా? అని షబ్బీర్ సవాల్ విసిరారు.