: టీడీపీ ట్రెండ్ సెట్ చేస్తుంది... ఫాలో అవదు: రావుల


తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వరంగల్ జిల్లాలో మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ట్రెండ్ సెట్ చేస్తుందని, ఎవరినీ ఫాలో కాదని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ పేరిట హంగామా చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు హైదరాబాదులో ఏమంత బలం లేదని అభిప్రాయపడ్డారు. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా రావుల, సండ్ర వెంకటవీరయ్య పార్టీ పరిశీలకులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రావుల పైవిధంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ... టీఆర్ఎస్ వాళ్లు లఫూట్ గాళ్లని, కాంగ్రెస్ వాళ్లు దొంగలని అభివర్ణించారు. మరో ఆరు నెలలు ఓపిక పడితే టీఆర్ఎస్ కార్యకర్తలను తరిమికొట్టే రోజులు వస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News