: మరింత ఎత్తునకు ముడి చమురు ధర... పెట్రోలు ఇంకా భారం!


ఇరాక్, యమన్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు ముడిచమురు ధరలను మరింత ఎత్తునకు చేర్చాయి. నేటి సెషన్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 12 సెంట్లు పెరిగి 66.93 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో యూఎస్ క్రూడాయిల్ ధర 26 సెంట్లు పెరిగి 59.95 డాలర్లకు చేరుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో భారత మార్కెట్లో ముడిచమురు ధర బ్యారల్ కు క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 35 పెరిగి 0.91 శాతం లాభంతో రూ. 3,893కు (జూన్ 19 కాంట్రాక్టు) చేరుకుంది. కాగా, చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్ దేశాలు నిరాకరిస్తుండడం కొంతమేరకు ధరలను పట్టి ఉంచుతోందని, లేకుంటే మరింతగా ధరలు పెరిగి వుండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, దేశవాళీ మార్కెట్లో 15 రోజుల వ్యవధిలో 7 రూపాయల మేరకు పెరిగిన పెట్రోలు ధర మరింతగా పెరగవచ్చని అంచనా. నెలన్నర క్రితం 56 డాలర్ల వరకూ పడిపోయిన బ్యారల్ క్రూడాయిల్ ధర అప్పటి నుంచి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News