: ఫేస్ బుక్ 'ఫైర్ చాలెంజ్'పై విమర్శల వెల్లువ
కొంతకాలం క్రితం ఓ వ్యాధిపై అవగాహనా ప్రచారం కల్పించడం కోసం సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో ప్రారంభమైన 'ఐస్ బకెట్ చాలెంజ్' బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఔత్సాహికులు ఐస్ వాటర్ ను శరీరంపై గుమ్మరించుకుంటూ తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు తాజాగా వచ్చిన 'ఫైర్ చాలెంజ్'పై మాత్రం నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైర్ చాలెంజ్ స్వీకరించిన వారు ఒంటిపై మండే గుణం గల ద్రవాన్ని పోసుకొని నిప్పంటించుకోవాల్సి వుంటుంది. మంటలు వ్యాపించేలోగా, వారు స్విమ్మింగ్ పూల్ లోకి దూకాలి. ఈ ఛాలెంజిలో పాల్గొంటున్న యువకుల్లో కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. అలా నిప్పంటించుకుని గాయపడిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఈ తరహా ప్రచారం వద్దని అంటున్నారు. ఈ ఫైర్ చాలెంజ్లో పాల్గొన్న టైలర్ ఓ కానర్ (9), అతడి అన్న షౌన్ (11) తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. వీరు నిప్పంటించుకున్న వీడియోను ఇంటర్నెట్లో పెట్టిన వారు ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు వద్దని చెబుతున్నారు.