: సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లోకి వెళ్లగలరా?... అలా వెళ్తే రాళ్లతో కొడతారు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైకాపా అధినేత జగన్ సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లగలరా? అని ప్రశ్నించారు. అలా వెళ్తే, జనాలు రాళ్లతో కొడతారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు... రాష్ట్రంలో రైతులు, మహిళలు ఆనందంగా ఉన్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీలను చంద్రబాబు మరచిపోయారని... దీంతో, రైతులపై అదనపు వడ్డీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో భరోసా యాత్ర చేస్తున్న సందర్భంగా, జగన్ పైవ్యాఖ్యలు చేశారు.