: ఒకే చోట ఐదేళ్లు పనిచేస్తే బదిలీ కావాల్సిందే...రేపటి నుంచి ఏపీలో ఉద్యోగుల బదిలీలు


ఏపీలో రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలకు తెర లేవనుంది. జూన్ 5 దాకా కొనసాగనున్న ఈ బదిలీల వ్యవహారాన్ని జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారు బదిలీలకు సంబంధించి పూర్తి స్థాయి విధి విధానాలతో కూడిన నోటిఫికేషన్ ను రేపు జారీ చేయనుంది. ఐదేళ్ల పాటు ఒకే స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈసారి కచ్చితంగా బదిలీ తప్పదట. అంతేకాక బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రభుత్వం నోటిఫికేషన్ లో పలు కీలక అంశాలను పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News