: ‘కారు’ స్పీడును ‘సైకిల్’ అందుకోలేకపోతోంది: కల్వకుంట్ల కవిత


తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం రాజకీయంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వేగాన్ని టీడీపీ అందుకోలేకపోతోందని చెప్పేందుకు ఆమె ‘‘కారు స్పీడును సైకిల్ అందుకోలేకపోతోంది’’ అనే పద ప్రయోగాన్ని వాడారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో జరిపిన పర్యటనపైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన పిక్నిక్ కు వచ్చి వెళ్లినట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళుతోందని చెప్పిన ఆమె, త్వరలోనే గుజరాత్ ను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News