: ప్రమాణం చేసిన చోటే బహిరంగ సభ...ఏడాది పాలన ‘సభ’పై చంద్రబాబు సర్కారు యోచన


ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నానా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 7 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు భారీ బహిరంగ సభను నిర్వహించాలని చంద్రబాబు సర్కారు తీర్మానించింది. ఇందుకోసం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతాన్నే వేదికగా చేసుకోవాలని యోచిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఎన్నికైన విషయం తెలిసిందే. గతేడాది జూన్ 8న ఆయన విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున వర్సిటీలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా అదే స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News