: జగిత్యాల జిల్లా కేంద్రం కాబోతోంది: నిజామాబాదు ఎంపీ కవిత ప్రకటన
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. మెదక్ జిల్లాలోని ప్రధాన పట్టణం సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఆయన కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా మరో కొత్త జిల్లాను ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుందని ఆమె కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా జగిత్యాల పట్టణం నిరాదరణకు గురైందని ఆమె ఆరోపించారు. జగిత్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టిస్తామని ఆమె పేర్కొన్నారు.