: నాడు 'ముఖ్యమంత్రి మోదీ' ప్రతిపాదించిన సెజ్ ను రద్దు చేసిన ప్రధాని మోదీ!


నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో, స్వయంగా ప్రతిపాదించి, కేంద్ర అనుమతులు పొందిన కచ్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని రద్దు చేస్తూ, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2007 ప్రాంతంలో చేతివృత్తుల వారికి లబ్ధిని కలిగించేలా, కచ్ జిల్లాలోని మోతీ చిరాల్ గ్రామంలో 132 హెక్టార్లలో సెజ్ ను ప్రతిపాదించగా, అప్పటి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. జూన్ 2007లో ఈ అనుమతులు లభించగా, ఆశించిన రీతిలో పనులు జరగలేదు. దీంతో సెజ్ ఏర్పాటుకు సమయాన్ని జూన్ 2011 వరకూ పొడిగించారు. గుజరాత్ గ్రోత్ సెంటర్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (జీజీసీడీసీ) ఆధ్వర్యంలో పనులు ప్రారంభం కాగా, భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇదే విషయమై అప్పటి యూపీఏ, ఇప్పటి ఎన్డీయే సైతం జీజీసీడీసీతో పలుమార్లు చర్చించాయి. మరోవైపు సెజ్ డెవలపర్ నుంచి సైతం స్పందన రాకపోవడంతో సెజ్ అనుమతులను రద్దు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News