: మావోల లొంగుబాటుకు 'బీబీసీ' బాసట!
అడవుల్లో తిరుగుతున్న అన్నలను జనజీవన స్రవంతిలోకి కలిపేందుకు బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) సేవలను మరింతగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. బీబీసీ రేడియోతో చేసిన ప్రయోగాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో సత్ఫలితాలివ్వడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లోనూ ఇదే తరహాలో ముందడుగు వేసి లొంగిపోతే లభించే సౌకర్యాలపై ప్రచారం సాగించాలని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ద్వారానే పునరావాస కార్యక్రమాలపై ప్రచారం చేసినప్పటికీ, మావోయిస్టులు నమ్మలేదు. దీంతో అధికారులు ప్రపంచవ్యాప్తంగా పేరున్న బీబీసీని నమ్మారు. మావోలు సైతం బీబీసీ ప్రచారానికి స్పందించారు. 2013లో 282 మంది మావోలు లొంగుబాట పట్టగా, ఆ సంఖ్య 2014లో 671కి చేరింది. ఈ సంవత్సరం మరింతమంది లొంగిపోయేలా బీబీసీ సాయంతో మరింతగా ప్రచారం సాగించాలని భావిస్తున్నారు.