: ప్రియురాలికి కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చిన దుర్మార్గుడు
హైదరాబాదులో మరో ప్రేమోన్మాది ఘాతుకం వెలుగుచూసింది. భర్తను వదిలేసి తనను నమ్మి వచ్చిన అమాయకురాలిని ఓ దుర్మార్గుడు అంతమొందించాడు. కూల్ డ్రింక్ లో విషం కలిపి బాధితురాలితో తాగించిన ఆ ఉన్మాది ఆమెను ఆస్పత్రి పాల్జేశాడు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు నేటి ఉదయం కన్నుమూసింది. వివరాల్లోకెళితే, నరేంద్ర అనే యువకుడితో వివాహేతర సంబంధం నెరపిన రీనా అనే వివాహిత, అతడి మోజులో పడి భర్తను కూడా వదిలేసింది. రెండేళ్ల పాటు నరేందర్, రీనాలు సహజీవనం చేశారు. తాజాగా ఆమెను వదిలించుకునేందుకు పథకం వేసిన నరేందర్ రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ లో విషం కలిపి ఆమెతో తాగించి పరారయ్యాడు. దీంతో రీనా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై ఫిర్యాదునందుకున్న పోలీసులు నరేందర్ కోసం గాలింపు మొదలుపెట్టారు.