: నేడు హస్తినకు ఏపీ సీఎం... బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు పార్టీలు అటు కేంద్రంలోనే కాక ఇటు ఏపీలోనూ భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగే భేటీ ఇరుపార్టీల పొత్తుకు సంబంధించి కీలక అంశాల చర్చకు వేదిక కానుందని సమాచారం. అంతేకాక టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ పదవి అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

  • Loading...

More Telugu News