: సెల్ ఫోన్ బ్యాటరీల రూపంలో బంగారం...శంషాబాదులో 2 కిలోల బంగారం పట్టివేత
విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో తరలివస్తున్న బంగారం వివిధ రూపాల్లో మన దేశానికి చేరుకుంటోంది. నిఘా అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. నేటి ఉదయం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారాన్ని పట్టేశారు. అబుదాబీ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు పరిశీలించగా సెల్ ఫోన్ బ్యాటరీల రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.