: 2024లో ఏపీ సీఎంగా లోకేశ్...పీఎం కుర్చీలో చంద్రబాబు: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ జోస్యం!
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ 2024లో ఏపీ సీఎం పదవిని అలంకరించబోతున్నారట. ఇక ప్రస్తుత ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు మాత్రం భారత ప్రధాన మంత్రి పదవిని అధిష్టించనున్నారట. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ జోస్యం చెప్పారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా రాజేంద్రప్రసాద్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పార్టీకి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నారా లోకేశ్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించేలా సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.