: బోల్తా కొట్టిన ‘కేశినేని’ బస్సు...30 మందికి గాయాలు, 10 మంది కండీషన్ సీరియస్


తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిండా ప్రయాణికులతో నిన్న రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరిన కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు అనంతపురం జిల్లా పరిధిలో బోల్తా కొట్టింది. జిల్లాలోని గుత్తి మండలం కొత్తపేట వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా వుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News