: అమెరికాను ఒత్తిడిలోకి నెడుతున్న చైనా చర్య


అనతికాలంలోనే అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా ఎదిగిన చైనా ఆయుధ రంగంలోనూ పోటీకి తెరదీసిింది. తన లాంగ్ రేంజ్ క్షిపణులను రీ-ఇంజినీరింగ్ చేస్తోంది. ఒక్కో క్షిపణి అనేక వార్ హెడ్లను మోసుకెళ్లగలిగేలా, తన వద్ద ఉన్న అస్త్రాలను ఆధునికీకరిస్తోంది. చైనా చర్యతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో మిసైల్ డిఫెన్స్ ను ఏర్పాటు చేసే విషయమై మునుపెన్నడూ లేనంత ఒత్తిడిలో పడ్డారని 'ద న్యూయార్క్ టైమ్స్' కథనం వెలువరించింది. వార్ హెడ్లను సూక్ష్మీకరించడం, ఒక్క మిస్సైల్ కు మూడు అంతకుమించి వార్ హెడ్లను సంధానించడం ద్వారా కొన్ని క్షిపణులను మరింత శక్తిమంతం చేయాలన్న చైనా నిర్ణయం తప్పక గమనించాల్సిన అంశమని అమెరికా భావిస్తోంది. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు ఇది నిదర్శనమని అమెరికా రక్షణ వర్గాలు అంటున్నాయి. అయితే, పసిఫిక్ ప్రాంతంలో తమ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేస్తున్నదని, చైనాను ఉద్దేశించి కాదని అమెరికా అధికారికంగా పేర్కొంటున్నదని పత్రిక వివరించింది. అదే సమయంలో... పొరుగు దేశాలను భయాందోళనలకు గురిచేస్తూ, ముఖ్యంగా, అమెరికా మిత్ర దేశాలను హడలెత్తిస్తూ, అమెరికాను పశ్చిమ పసిఫిక్ ప్రాంతం నుంచి వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్న చైనాను నిలువరిస్తానని చెప్పేందుకు అధ్యక్షుడు ఏదో చర్య తీసుకుంటారని 'ద న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది.

  • Loading...

More Telugu News