: ఆ ఎమ్మెల్యే 'అమ్మ' కోసం సీటు త్యాగం చేశాడా?
తమిళనాడులో ప్రస్తుత పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఊరట పొందిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మళ్లీ సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. వచ్చే వారం ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని తమిళనాట ప్రచారం అవుతోంది. ఇదిలావుంటే, ఆర్కే నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పి. వెట్రివేల్ అనే ఎమ్మల్యే ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. వెట్రివేల్ రాజీనామాను స్పీకర్ ధనపాల్ ఆమోదించారు. అనంతరం, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని ప్రకటించారు. మళ్లీ పదవిని అధిష్ఠించనున్న 'అమ్మ' ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తారని, అందుకే వెట్రివేల్ తన సీటును త్యాగం చేసి విధేయతను ఇలా చాటుకున్నాడని అర్థమవుతోంది.