: చంద్రబాబుపై టీడీపీ ఎంపీ నిష్టూరం
టీడీపీ ఎంపీ శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వ్యాఖ్యలు చేశారు. సీఎం సొంత జిల్లా చిత్తూరును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీట్లు తక్కువగా వచ్చాయని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా గెలుచుకున్న ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలపై అపార ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ ఆరు సీట్లు గెలుచుకోవడమే గొప్ప అని అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రసాద్ పైవిధంగా స్పందించారు.