: భర్తను తెలివిగా ఇరికించింది!
దుబాయ్ లో ఓ మహిళ తన భర్త రెండో పెళ్లికి సిద్ధమవడాన్ని భరించలేకపోయింది. తమ జీవితంలోకి మరో వ్యక్తి రావడాన్ని అంగీకరించలేకపోయింది. దీంతో, తానుండగానే మరో పెళ్లికి రెడీ అయిన భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు బుద్ధిబలాన్ని ప్రదర్శించింది. భర్త మరో పెళ్లి ఉత్సాహంలో మునిగితేలుతుండగా, అతడి కారు తీసుకుని రోడ్డుపైకి వెళ్లింది. ఇష్టం వచ్చినట్టు కారులో షికారు చేసింది. ట్రాఫిక్ రూల్సు ఏవీ పట్టించుకోకుండా, సోదరుడి సాయంతో ఇష్టారాజ్యంగా రాత్రంతా విహరించింది. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడ ఏమేరకు జరిమానా విధిస్తారో బాగా తెలిసిన ఆ మహిళ, భర్తను ఇరికించాలని అతడి పేరిట రిజిస్టర్ అయిన కారును ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉన్న కెమెరాల్లో పడేలా నడిపింది. రాత్రంతా పలు మార్లు ట్రాఫిక్ రూల్సు ఉల్లంఘన జరగడంతో పోలీసులు కారు యజమాని అయిన భర్తకు రూ.50 లక్షల జరిమానా విధించారు. అతడి కారు నెంబర్ సీసీ కెమెరా ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించేలా సదరు భార్య వ్యవహరించింది. దీంతో, పోలీసుల పని సులువైంది.