: ఇలాగే మాట్లాడితే జనంలో చులకన అవుతారు: వెంకయ్యనాయుడు


కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపైనా, రాహుల్ గాంధీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, యూపీఏ హయాంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో లక్షా అరవై వేల మంది రైతులు ప్రాణాలు విడిచారని, అప్పుడు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు రాత్రికి రాత్రే జరగలేదని, ఈ అంశంపై రాహుల్ అవగాహన రాహిత్యం తేటతెల్లమైందని అన్నారు. ఇలాగే విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే రాహుల్ జనంలో చులకన అవుతారని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News