: ఫేస్ బుక్ వాల్ పై నగ్న ఫొటోలు... బెంబేలెత్తిస్తున్న చైనా వైరస్!
ఫేస్ బుక్ యూజర్లను ఇప్పుడు ఓ కొత్త వైరస్ వేధిస్తోంది. ఈ వైరస్ తీరుతెన్నులను నిపుణులు వివరించారు. ఫేస్ బుక్ అకౌంట్ లో ప్రవేశించగానే వాల్ పై న్యూడ్ ఫొటోలు దర్శనమిస్తాయి. వాటిని క్లిక్ చేస్తే అభ్యంతరకర సీన్లు, చిత్రాలు ఓపెన్ అవుతాయి. ఒక్కసారి అవి ఓపెనయ్యాక వాటిని డిలీట్ చేయడం అసాధ్యమని తెలిపారు. దీన్నో స్పామర్ వైరస్ అని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఇది చైనా హ్యాకర్ల పనే అని అంటున్నారు. హ్యాకర్లు ఈ అశ్లీల చిత్రాలను మీ ఫేస్ బుక్ ఖాతాలోని ఓ 40 మందితో ట్యాగ్ చేస్తారని, ఆ ఫొటోలను క్లిక్ చేసినప్పుడు ఆ 40 మంది ఖాతాల్లోనూ వైరస్ ప్రవేశిస్తుందని వివరించారు. ఇప్పటికే ఫేస్ బుక్ లో కలకలం రేగిందని, మిత్రుడని భావిస్తే ఇలాంటి ఫొటోలు పెట్టాడేంటని పలువురు గుసగుసలాడుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఇదంతా స్పామర్ వైరస్ మహిమేనని తేల్చేశారు.