: పాక్, జింబాబ్వే సిరీస్ కు అంపైర్లు, రిఫరీలను పంపడంలేదు: ఐసీసీ


భద్రతకు భరోసా ఉండదని తెలిసినా, ఆర్థిక కారణాలతో పాకిస్థాన్ టూర్ కు సిద్ధమైన జింబాబ్వే , సొంతగడ్డపై మ్యాచ్ లు నిర్వహించుకోవాలని పరితపిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు ఐసీసీ తాజా నిర్ణయం కాస్తంత నిరాశ కలిగించేదే. పాక్-జింబాబ్వే సిరీస్ కు తాము రిఫరీలు, అంపైర్లను పంపలేమని ఐసీసీ స్పష్టం చేసింది. భద్రత సలహాదారు నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఆలోచనలో పడ్డాయి. అయితే, కొద్దిగా ఊరటనిస్తూ, ఈ సిరీస్ కు అధికారిక గుర్తింపు ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో, స్థానిక అంపైర్లు, రిఫరీలతో మ్యాచ్ లు నిర్వహించుకునేందుకు పాక్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు చేసుకుంటోంది.

  • Loading...

More Telugu News