: నగదు, నగలే కాదు... వధువునూ ఎత్తుకెళ్లారు!


దోపిడీకి వచ్చిన దొంగలు వధువును కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ పెళ్లి బృందంపై దాడి చేసిన దోపిడీదొంగలు నగదు, నగలే కాకుండా పెళ్లి కూతురునూ ఎత్తుకెళ్లారు. 150 మంది పెళ్లి వారు గుజరాత్ లోని గర్బారా నుంచి మధ్యప్రదేశ్ లోని మాండ్లా తిరిగి వస్తుండగా పిటోల్ వద్ద ఘటన జరిగింది. సాయుధులైన దొంగలు పెళ్లివారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఇక, పెళ్లి కూతురు సుమిత్రా బెన్ తమను గుర్తు పట్టడంతో వారు ఆమెను కూడా ఎత్తుకెళ్లారు. దీనిపై, ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే రంగంలోకి దిగారు. దొంగలు ఉపయోగించిన జీపును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా రికార్డయిన వీడియో ఫుటేజిని పరిశీలిస్తే ఏవైనా ఆధారాలు లభ్యమవుతాయేమోనని, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News