: అంతా ఈవెంట్ మేనేజ్ మెంటే: మోదీపై కమల్ నాథ్ విసుర్లు


నరేంద్ర మోదీ సర్కారుపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ధ్వజమెత్తారు. అధికారం చేపట్టిన నాటి నుంచి 'అది చేస్తాం, ఇది చేస్తాం' అంటూ ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. మోదీ అండ్ కో ప్రపంచంలోనే అత్యుత్తమ ఈవెంట్ మేనేజ్ మెంట్ నిపుణులని ఎద్దేవా చేశారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ కు, ప్రకటనలు చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం, ప్రధాని ఉన్నారని దుయ్యబట్టారు. ఇది మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని అన్నారు. మోదీ ఏడాది పాలన సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు.

  • Loading...

More Telugu News