: మీడియా ఎదుట భోరుమన్న నీతూ అగర్వాల్


ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో అరెస్టయిన నటి నీతూ అగర్వాల్ ను ప్రాణభయం వెంటాడుతోంది. తన ప్రాణాలు తీయడానికి కుట్ర జరుగుతోందని, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బెయిల్ పై బయట ఉన్న ఆమె కర్నూలు జిల్లా రుద్రవరం పీఎస్ లో సంతకం చేసేందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ భోరుమని విలపించారు. తనకు చచ్చిపోవాలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లర్లు తనను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసిందని, తీవ్ర భయాందోళనలో ఉన్నానని పేర్కొన్నారు. స్మగ్లర్ మస్తాన్ వలీ ప్రేమ అంటూ వెంటపడి, పెళ్లి చేసుకుని మోసం చేశాడని వాపోయారు. తానే తప్పూ చేయలేదని, స్మగ్లింగ్ తో తనకు సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులోంచి బయటపడతానన్న నమ్మకం ఉందని తెలిపారు. కాగా, నీతూ అగర్వాల్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News