: సినిమా యాక్టర్లకు ఆ శక్తి ఉంది: తలసాని
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలింనగర్ లో సినీ ప్రముఖులతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినిమా నటులు స్వచ్ఛ హైదరాబాద్ కు విశేషంగా ప్రచారం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనేలా నటులు తమ అభిమానులను ఉత్తేజపరచాలని అన్నారు. సినిమా యాక్టర్లు సమాజాన్ని ప్రభావితం చేయగలరని, వారికి ఆ శక్తి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమను దేశంలోనే టాప్ రేంజికి తీసుకెళతానని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తలసానితో పాటు సినీ ప్రముఖులు వెంకటేశ్, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, దగ్గుబాటి సురేశ్, రకుల్ ప్రీత్ సింగ్, జీవిత తదితరులు పాల్గొన్నారు.