: కూచిపూడి నాట్య దిగ్గజాలకు షాకిచ్చిన కేసీఆర్ సర్కారు!


అభినయ వేదంగా పేరుగాంచిన కూచిపూడి నాట్యానికి వన్నె తెచ్చిన కళాకారుల్లో రాజా రెడ్డి, ఆయన భార్య రాధా రెడ్డి ప్రముఖులు. వారు కూచిపూడి నృత్య రీతికి చేసిన సేవల దృష్ట్యా దిగ్గజాలుగానే భావించుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ దంపతుల గురించి పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. వీరి విద్వత్తు అలాంటిది. అలాంటి నాట్య కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వం షాకిచ్చింది. రాజారెడ్డి దంపతులు తమ కుమార్తె యామినితో కలిసి ప్రతి ఏడాది హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తుంటారు. ఎప్పటి నుంచో ఇది ఆనవాయతీగా వస్తోంది. అయితే, ఈ ఏడాది మాత్రం వారి ప్రదర్శనకు అనుమతి లభించలేదు. అందుకు ప్రభుత్వం చెప్పిన సమాధానం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. కూచిపూడి నాట్యానికి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక విభాగం గుర్తింపులేదని అధికారులు తెలిపారు. కూచిపూడి నాట్యం తెలంగాణ కళా రూపం కాదన్నది ఇక్కడ కీలకాంశం. ఈ కారణంగానే రాజారెడ్డి, రాధారెడ్డిలకు అనుమతి నిరాకరించినట్టు అర్థమవుతోంది. పద్మ పురస్కారాలు అందుకున్న మహోన్నత నాట్య కళకారులను ఈ విధంగా అవమానించడం తగదని కళాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News