: ఎగసిపడిన డీజిల్... బకెట్లు, బిందెలతో పరుగులు పెట్టిన ప్రజలు
కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెంలో హెచ్ పీసీఎల్ చమురు సంస్థకు చెందిన పైపు లైన్లు లీకయ్యాయి. దీంతో, డీజిల్ ఎగసిపడింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే చేతికి అందిన బకెట్లు, బిందెలతో పైపు లైన్ల వద్దకు పరుగులు తీశారు. గ్రామం వద్ద హెచ్ పీసీఎల్ స్టోరేజ్ యూనిట్ ఉంది. దానికి సమీపంలోని పైపులైన్ల నుంచి లీకైన ఆయిల్ పక్కనే ఉన్న డ్రైనేజ్ లో కలుస్తుండడాన్ని చూసిన ప్రజల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమాచారం తెలిసిన చమురు సంస్థ అధికారులు రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దారు. పైపు కింది భాగంలో లీకేజ్ ను గుర్తించిన అధికారులు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. దీంతో, లీకేజ్ నిలిచిపోయింది.