: వన్డే క్రికెట్ కు బ్రాడ్ హడిన్ గుడ్ బై


ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు గుడ్ బై చెబుతున్నట్టు ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్ హడిన్ తెలియజేశాడు. తన రిటైర్మెంటుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు బెంగళూరులో వివరించాడు. 37 సంవత్సరాల బ్రాడ్ 126 వన్డే మ్యాచ్ లు ఆడి 3,122 పరుగులను (సరాసరి 31.53) సాధించాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తరువాత ప్రస్తుత ఆస్ట్రేలియా టీమ్ లో హడిన్ అత్యంత సీనియర్. తాను ఎంతో కాలం పాటు వన్డే క్రికెట్ ను ఆస్వాదించానని అన్నాడు. తన జీవితంలో ఆట ఇక చాలునని భావిస్తున్నానని తెలిపాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నెంబర్ వన్ 1గా ఉన్న సమయంలో, తాను సభ్యునిగా ఉన్న జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న తరుణంకన్నా ఆట నుంచి తప్పుకోవడానికి మరో మంచి సమయం ఇంకేముంటుందని ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News