: మా అశ్లీల దృశ్యాలు ఫేస్ బుక్ లో పెడుతున్నారు: మరోసారి వార్తల్లోకెక్కిన రోహ్ తక్ సిస్టర్స్


రోహ్ తక్ సిస్టర్స్ గుర్తున్నారా? నాలుగైదు నెలల క్రితం బస్సులో తమను వేధించిన యువకులను చితకబాదడం, ఆపై ఓ పార్కులో వేధించిన యువకుడికి బుద్ధి చెప్పడం వంటి ఘటనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. తమ చిత్రాలను అశ్లీలకరంగా మార్ఫింగ్ చేసి కొందరు ఫేస్ బుక్ లో పెడుతున్నారని ఆరోపిస్తూ, ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. గతంలో తమను వేధించి జైలుకెళ్లిన ఓ యువకుడు కోర్టు బయట రాజీ పడదామని ఒత్తిడి తెస్తున్నాడని, తాము అంగీకరించకపోవడంతోనే ఈ పని చేస్తున్నాడని వారు ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేసే వరకూ తాము ఎస్పీ ఆఫీసు ముందు నుంచి కదిలేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అధికారికంగా మాత్రం స్పందించలేదు.

  • Loading...

More Telugu News