: 'దైవకణం'పై 5 వేల మంది భాగస్వామ్యంతో 33 పేజీల అధ్యయనం... వరల్డ్ రికార్డు
సామాన్య శాస్త్రంలో వేలాది ప్రశ్నలను లేవనెత్తిన హిగ్స్ బోసన్ ద్రవ్యరాశి (దైవకణం - గాడ్ పార్టికల్)పై ఓ అధ్యయనాన్ని తయారు చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి సలహాలు, సమాచారాన్ని కోరారు. వాటన్నింటినీ క్రోఢీకరించి రీసెర్చ్ అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇందులో మొత్తం 5 వేల మంది సైంటిస్టులు, ఔత్సాహికులు భాగస్వామ్యం వహించారు. ప్రపంచ చరిత్రలో ఓ అధ్యయనంలో ఇంతమంది భాగం పంచుకోవడం ఇదే తొలిసారి. మొత్తం 33 పేజీలున్న ఆర్టికల్ లో 24 పేజీలు ఈ 5 వేల మంది పేర్లు, వారు పనిచేసే సంస్థలను ప్రస్తావించేందుకే సరిపోయిందట. స్విట్జర్లాండ్ లోని జెనీవా సమీపంలో ఉన్న యూరప్ ఫిజిక్స్ ల్యాబ్ 'సెర్న్'లోని లార్జ్ హార్డన్ కొలైడర్ (ఎల్ హెచ్ సీ) నేపథ్యంగా అధ్యయనం సాగింది. దైవకణం గురించిన మరింత సమాచారాన్ని ఇందులో పొందుపరిచారట.