: ఆ పని చేస్తే మంత్రి హరీశ్‌ రావు విగ్రహం పెడతాం: బీజేపీ


హైదరాబాద్ నడిబొడ్డులోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని చెప్పిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు తక్షణం ఆ నిధులు విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఉదయం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హరీశ్ తన మాటను నిలబెట్టుకుంటే, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇస్తానన్న నిధులిచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. 'స్వచ్ఛ హైదరాబాద్‌' కార్యక్రమంలో అందరినీ భాగస్వాములుగా చేయడం హర్షణీయమని, ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతిస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News