: కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి


ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఈ దఫా ఏకంగా రాజధాని కాబూల్ విమానాశ్రయాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఉదయం 10:30 గంటల సమయంలో ఆత్మాహుతి బాంబు దాడి చేశారు. ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకోవడంతో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడగా, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు తాలిబన్ ఉగ్రవాదులే కారణమని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News