: ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకున్న పాము


ఇంటి బయట నిద్రిస్తున్న తండ్రి, ఇద్దరు కుమార్తెలను పాము కరవడంతో వారు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తమ్మయ్య (50) పొలంలో గుడిసె వేసుకుని వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరు కుమార్తెలు పల్లవి (7), అంజలి (5)లతో కలిసి ఇంటి ముందు పడుకున్నాడు. కాగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు లేచి ఏడుస్తుండడంతో, పాము కరిచిందని గమనించిన తమ్మయ్య వారిని ఆసుపత్రికి తీసుకుపోతుండగా, మార్గమధ్యంలోనే మరణించారు. మరికాసేపటికి తమ్మయ్య కూడా నోటి నుంచి నురగ కక్కి మరణించాడు. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News