: చీపురు పట్టిన చిత్రసీమ... రోడ్లూడ్చిన వెంకటేష్, రాజేంద్రప్రసాద్, రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు చిత్ర పరిశ్రమ చీపురు పట్టింది. భాగ్యనగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన 'స్వచ్ఛ హైదరాబాద్'కు తమవంతు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు ఈ ఉదయం రోడ్లపై చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చారు. సినీనటులు వెంకటేష్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, వేణు మాధవ్, నటి జీవిత, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దగ్గుబాటి సురేష్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తామంతా క్లీన్ సిటీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.