: యూఎస్ ఆపరేషన్ విజయవంతం... ఉగ్ర నేత అల్ సయీఫ్ హతం


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్) కీలక నేత అల్ సయీఫ్ అమెరికా సైన్యం దాడిలో హతమయ్యాడు. సిరియా తూర్పు ప్రాంతంలోని అల్-అమర్ ప్రాంతంలో సైన్యం జరిపిన దాడుల్లో సయీఫ్ ను మట్టుబెట్టినట్టు పెంటగాన్ చీఫ్ ఆష్ కార్టర్ తెలియజేశారు. రెండు అమెరికా యుద్ధ హెలికాప్టర్లు ఈ దాడులు చేశాయని, సయీఫ్ ఎక్కడున్నాడన్న విషయాన్ని పక్కాగా తెలుసుకున్న తరువాతే దాడులు జరిగాయని తెలుస్తోంది. సయీఫ్ తో పాటు మరో ఆరుగురు కూడా అమెరికా దాడిలో మరణించారని, వీరిలో ఇద్దరు సౌదీ పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుఝామున ఈ దాడి జరిగి ఉండవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News