: రూ. 2,350కి ఆండ్రాయిడ్ 3జి స్మార్ట్ ఫోన్
దేశవాళీ లోకాస్ట్ మొబైల్ విక్రయ సంస్థ సెల్ కాన్ మరో ఆకర్షణీయ ప్రొడక్టును విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో 3జి ఫోన్ క్యాంపస్ ఎ359ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 2,350 అని వెల్లడించింది. ఇండియాలో ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో ఇదే అత్యంత తక్కువ ధరకు లభించే ఫోనుగా సంస్థ పేర్కొంది. 3.5 అంగుళాల హెచ్ వీజీఏ డిస్ప్లే, 1జిహెచ్ ప్రాసెసర్, 256 ఎంబీ రామ్, 512 ఎంబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 2 ఎంపీ కెమెరాలతో పాటు వైఫై, జీపీఆర్ఎస్ సదుపాయాలు ఈ ఫోన్ కు అదనపు ఆకర్షణలని తెలియజేసింది. కేవలం 96 గ్రాముల బరువుండే ఫోను 1200 ఎంఎహెచ్ బ్యాటరీతో లభిస్తుందని వివరించింది.