: ఢిల్లీలో ఎన్ కౌంటర్... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను ఎన్ కౌంటర్ లో హతమార్చినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మోసాలు, దాడులు వంటి పలు కేసుల్లో మనోజ్ వశిష్ఠ వాంటెడ్ క్రిమినల్ అని, ఆయనకు సంబంధించిన సమాచారంపై రివార్డు కూడా ఉందని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ వివరించారు. సెంట్రల్ ఢిల్లీలోని న్యూ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని సాగర్ రత్న రెస్టారెంటుకు మనోజ్ వస్తున్నాడన్న పక్కా సమాచారంతో వల పన్నినట్టు తెలిపారు. పోలీసుల రాకను తెలుసుకున్న మనోజ్ తుపాకీ తీసి కాల్చడం ప్రారంభించాడని వివరించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో మనోజ్ మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలిపారు.