: నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు... ఎక్కడ తెలుసుకోవచ్చంటే...!
ఆంధ్రప్రదేశ్ రాష్టం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలు ఈ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలకు మొత్తం 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. కాగా, పరీక్షల ఫలితాలను కొన్ని ప్రైవేటు వెబ్‌సైట్లు, వివిధ రకాల మొబైల్ ఆపరేటర్లు, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం www.aponline.gov.in, www.bsetelangana.org, www.results.cgg.gov.in వెబ్ సైట్లలో చూడవచ్చు. ఎస్‌ఎంఎస్‌ల రూపంలో తెలుసుకోవాలంటే, ఎయిర్ సెల్ / వొడాఫోన్ / రిలయన్స్ కస్టమర్లు 58888 నెంబరుకు హాల్ టికెట్ నెంబరును పంపి, ఐవీఆర్‌ఎస్ ద్వారా తెలుసుకోవాలంటే, యూనినార్ / ఎయిర్ టెల్ / ఎయిర్ సెల్ / వొడాఫోన్ కస్టమర్లు 5333530 నెంబరుకు కాల్ చేసి పరీక్షల ఫలితాలు పొందవచ్చు.