: భారత క్రికెట్ జట్టులోకి సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్, జహీర్ పునరాగమనం!
అవును, మీరు చూస్తున్నది నిజమే. భారత క్రికెట్ జట్టులోకి స్టార్ బ్యాట్స్ మెన్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, బౌలర్లు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లు మరోసారి రానున్నారు. త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ టూరుకు వీరిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అసలు ఓ రెండేళ్ల క్రితం వరకూ వీరు నలుగురూ లేకుండా జట్టును ఊహించుకునే పరిస్థితే లేదు. 2011లో జరిగిన వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకోవడంలో వీరి పాత్ర మరువలేనిది. అయితే మారిన పరిస్థితులు, ఫామ్ ను కోల్పోవడం వంటి కారణాలతో వీరు జట్టులో స్థానం కోల్పోయారు. సుదీర్ఘకాలం పాటు జట్టుకు సేవలు చేసిన వీరికి సరైన రీతిలో వీడ్కోలు లభించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. దీంతో తనపై పడ్డ మచ్చను చెరుపుకునేందుకు వీరికి చివరి అవకాశంగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపిక చేసి ఘనమైన వీడ్కోలు పలకాలని బీసీసీఐ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో... ఈ క్రికెట్ దిగ్గజాలు మరోసారి మైదానంలో అలరించే అవకాశాలున్నాయన్నమాట.