: వాట్సన్ సెంచరీతో ప్లేఆఫ్ కు రాజస్థాన్
వాట్సన్ అద్భుత సెంచరీకి (59 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 నాటౌట్) తోడు, క్రిస్ మోరిస్ (4/23) బౌలింగ్ లో అద్భుతంగా రాణించడంతో నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కోల్ కతాను ఓడించి నాకౌట్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. రాజస్థాన్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన కోల్‌కతా తొమ్మిది వికెట్లకు 190 రన్స్ మాత్రమే చేయగలిగింది. యూసుఫ్ పఠాన్ (35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 44) రాణించినా, జట్టును విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. రాయల్స్ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు నాలుగు, వాట్సన్, కులకర్ణిలకు చెరో రెండేసి వికెట్లు లభించాయి. కాగా, తమ చివరి మ్యాచ్ లో ఓడినప్పటికీ, 15 పాయింట్లతో ఉన్న కోల్ కతా ప్లేఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల ఫలితాలు కోల్ కతా భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి.