: తిరుమలకు పోటెత్తిన భక్తులు... రూ.2.34 కోట్లకు చేరిన శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీనివాసుడి సన్నిధి తిరుమల నేడు భక్తులతో పోటెత్తింది. తిరుమల కొండకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య క్షణక్షణానికి పెరిగిపోయింది. ప్రస్తుతం తిరుమలేశుడి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాలిబాట భక్తులకు 10 గంటలకు స్వామివారి దర్శనం లభిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఒక్కసారిగా భక్తులు ఆలయానికి పోటెత్తడంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగిపోయింది. నేడు ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.34 కోట్లకు చేరింది.