: తుమ్మలా... నీ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు!: టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన కిసాన్ సందేశ్ యాత్రలో భాగంగా పరామర్శించిన రైతుల కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులవేనని తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఆయన ప్రకటించారు. అయినా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వచ్చిన ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి రైతులను ఆదుకునేందుకు చేతులు రావట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.