: చైనాలో తొలి విదేశీ శాఖకు ఇన్ఫోసిస్ గ్రీన్ సిగ్నల్... కుదిరిన ఒప్పందం
దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పటిదాకా భారత భూభాగం నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కంపెనీ ఇప్పటిదాకా విదేశాల్లో దుకాణాలు తెరవనే లేదు. అయితే తన తొలి విదేశీ శాఖను ఆ కంపెనీ చైనాలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు చైనాకు చెందిన ఓ ప్రాంతీయ సంస్థతో ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంట చైనా వెళ్లిన ఇన్ఫీ ప్రతినిధులు మోదీ సమక్షంలోనే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం చైనాలో ఏర్పాటు కానున్న శాఖ కోసం ఇన్ఫోసిస్ 120 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనుంది.