: కేసీఆర్ పిట్టలదొర...ఫాంహౌస్ లో బ్రాందీ సీసాలు ఖాళీ చేస్తున్నారు: ఎర్రబెల్లి ధ్వజం


తెలంగాణ సీఎం కేసీఆర్ ను టీ-టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు పిట్టలదొరగా అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎర్రబెల్లి కొద్దిసేపటి క్రితం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన మొత్తం కేసీఆర్ కుటుంబ కబందహస్తాల్లో చిక్కుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పిట్టలదొర పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. పాలనను గాలికొదిలేసిన కేసీఆర్ తన ఫాంహౌస్ లో కూర్చుని బ్రాందీ సీసాలు ఖాళీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఆరు నెలల్లో టీఆర్ఎస్ నేతలను ప్రజలు తరిమికొడతారని ఆయన జోస్యం చెప్పారు. 2019లో టీడీపీ తెలంగాణ పాలన పగ్గాలను చేజిక్కించుకుంటుందని కూడా ఎర్రబెల్లి అన్నారు.

  • Loading...

More Telugu News