: చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాట్స్ మెన్ విలవిల... ఏడు వికెట్లకు 130 పరుగులు
ఐపీఎల్-8లో భాగంగా మోహాలీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. పించ్ హిట్టర్లున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి కేవలం 130 పరుగులు చేసింది. అంతేకాక ఏడు వికెట్లను చేజార్చుకుంది. అక్షర్ పటేల్ (32), రిషీ ధావన్ (25) మినహా మిగిలిన ఏ ఒక్కరు కూడా రాణించలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (6), డేవిడ్ మిల్లర్ (11) సహా మిగిలిన వారంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. పొదుపుగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు, వరుసగా పంజాబ్ వికెట్లు తీశారు. ఇక 131 పరుగుల విజయలక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ మరికాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.