: మెగాస్టార్ చిరంజీవికి అభిమాని షాక్... ఎమ్మెల్యేగా తిరుపతికి ఏం చేశారని నిలదీత


కాంగ్రెస్ పార్టీ నేత, మెగాస్టార్ చిరంజీవికి నేటి మధ్యాహ్నం రేణిగుంటలో ఓ అభిమాని షాకిచ్చాడు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక నగర అభివృద్ధికి ఏం చేశారని చిరును ఆయన అభిమాని నిలదీశాడు. కడప జిల్లా రైల్వే కోడూరులో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణకు వచ్చిన చిరంజీవి, హైదరాబాదు వెళ్లేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకున్నారు. సమాచారం అందుకున్న చిరు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిరును చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ‘‘ఎమ్మెల్యేగా తిరుపతికి ఏం చేశారో చెప్పండి’’ అంటూ ఓ అభిమాని చిరును ప్రశ్నించాడు. దీంతో చిరు షాక్ కు గురి కాగా, ప్రశ్నించిన అభిమానిని చిరు గన్ మెన్లు తోసేశారు. చిరు గన్ మెన్ల చర్యపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News