: రాహుల్ గాంధీ వచ్చింది, కేసీఆర్ కళ్లు తెరిపించేందుకే!: వీహెచ్
కిసాన్ సందేశ్ యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో నిన్న జరిపిన పాదయాత్రపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ ను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమాయకుడిగా అభివర్ణించారు. తాజాగా తుమ్మల కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఘాటుగా స్పందించారు. తెలంగాణ సీఎం కళ్లు తెరిపించేందుకే రాహుల్ గాంధీ వచ్చారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిత్యం రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా, ఏమాత్రం స్పందించని కేసీఆర్, రాహుల్ గాందీ పర్యటనతోనైనా కళ్లు తెరుస్తారనుకుంటున్నామని ఆయన అన్నారు.