: హైదరాబాదు ఎంత బాగా ఉందనుకుంటున్నామో... అంత బాగా లేదు: కేసీఆర్ వ్యాఖ్య


భాగ్యనగరి హైదరాబాదుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. విశ్వ నగరంగా కీర్తినందుకుంటున్న హైదరాబాదు ఎంత బాగా ఉందనుకుంటున్నామో, అంత బాగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మాదాపూర్ లో స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమం ప్రారంభం సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాదులోని పారిశుద్ధ్యాన్ని ప్రస్తావించారు. నగరంలోని పలు వీధులు మురికి కూపాలుగా ఉన్నాయన్న ఆయన, వాటిని శుభ్రంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛ హైదరాబాదులో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News